ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గను: ప్రధాని
న్యూఢిల్లీ: తాను ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గి పని చేయనని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. సంఘ్ పరివార్ ఒత్తిళ్లకు తలొగ్గి పని చేస్తున్నారనే ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీవిమర్శలపై ప్రధాని వాజ్‌పేయి మంగళవారం రాత్రి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఎదురు దాడికి దిగారు.
సోనియా గాంధీ వాడిన భాషను ఆయన ప్రశ్నించారు. తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని సోనియా తనకు గుర్తు చేశారని ఆయన అన్నారు.ఆమె ఉద్దేశం ఏమిటి? నా ప్రాథమిక విధులను ఆమె నాకెందుకు గుర్తు చేస్తున్నారు? అని ఆయన అడిగారు. సంఘ్‌పరివార్‌కు తలొగ్గవద్దని సోనియా అన్నారని ఆయనఅంటూ ఏ పరివార్ కా మామ్‌లా హై, సోనియా గాంధీ ఇస్‌మే దఖాల్ నా దే(ఇది పరివార్‌కు సంబంధించిన విషయం. దీంట్లో సోనియా జోక్యం చేసుకోవద్దు) అని ప్రధాని అన్నారు.












Click it and Unblock the Notifications
