పొటోకు తెలుగుదేశం సమర్థన
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిరోధక బిల్లు(పొటో)ను పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో తెలుగుదేశం పార్టీ సమర్థించింది. పొటోను సమర్థిస్తూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు సమావేశంలో ప్రసంగించారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై, పార్లమెంటుపై దాడులు, ముంబాయిలో, హైదరాబాద్‌ల్లో బాంబుపేలుళ్లు తీవ్రవాద చర్యలేనని ఆయన అన్నారు. ఈ తీవ్రవాదాన్ని నిరోధించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని ఆయన అన్నారు. గత ఐదేళ్ల నుంచి టాడాను ప్రయోగించడం లేదని ఆయన చెప్పారు. ఈ స్థితిలో ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పొటో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
