సహన స్ఫూర్తినిపెంపొందిచుకుందాం
న్యూఢిల్లీ: గుజరాత్‌లో మతపరమైన హింస చెలరేగడంపై రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో శాంతి సామరస్యాలనుపెంపొందించడానికి సప్రదాయబద్దమైన సంయమన స్ఫూర్తిని తిరిగి పాదుకొల్పడం అవసరమని ఆయన అన్నారు. గుజరాత్ మత ఘర్షణల దృష్ట్యా ఈ ఏడాది హోలీ జరుపుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.
హోలీని సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించుకుని ఆ పండుగ విశిష్టతను కాపాడుదామని ఉప రాష్ట్రపతి క్రిషన్‌కాంత్ అన్నారు. మత, కుల, స్థాయీ భేదాలను దాటి ప్రజల పరస్పర సహకారాన్నిపెంపొందించుకునే సందేశాన్ని హోలీ ఇస్తుందని ఆయన తన సందేశంలో అన్నారు. భావోద్వేగాలవినిమయాన్ని, సామాజిక అనుబంధాన్ని ఈ పండుగ పెంచుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications