ఎన్‌డిఎలో విభేదాలు లేవు: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: గుజరాత్‌విషయంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పూర్తి ఐక్యంగా వుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఎన్‌డిఎలో భిన్నాభిప్రాయాలున్నట్లు ప్రతిపక్షం చిత్రీకరిస్తోందని ఆయన శనివారం ధ్వజమెత్తారు. గుజరాత్ వ్యవహారంపై ఏ నిబంధన కింద పార్లమెంటులో చర్చ జరగాలనేవిషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదని ఆయన చెప్పారు.
పాలక కూటమిలో విభేదాలు లేవని, ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించడం అవసరమని ఆయన అన్నారు. గుజరాత్ సంఘటనలను తీవ్ర స్థాయిలో ఇది వరకే ఖండించానని వాజ్‌పేయి గుర్తు చేశారు.
గుజరాత్ సంఘటనలపై తాను చేసిన ప్రకటన కూడా చర్చకు దారి తీసిందని ఆయన చెప్పారు. మన రాజ్యాంగ నిర్మాతలు లౌకిక చట్రానికి పునాదులు వేశారని, మత ప్రాతిపదిక దేశానికి పునాదులు వేయలేదని ఆయన చెప్పారు.
చీకటిలో చిరు దీపాలు కూడా మార్గాలు చూపుతాయని, గుజరాత్ సంఘటనలు మన కృషిని ప్రశ్నార్థకం చేశాయని ఆయన అన్నారు. గుజరాత్ బాధితులకు సహాయం చేసేందుకుస్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయనకోరారు.












Click it and Unblock the Notifications
