ఆర్థిక పెరుగుదలకు విధానం: యశ్వంత్
వాషింగ్టన్: భారత ఆర్థికపెరుగుదల రేటు స్థిరంగా ఏడు నుంచి 8 శాతం వుండేలా ఒక విధానాన్ని అవలంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా చెప్పారు. ఏడు, ఎనిమిది శాతం కన్నా తక్కువపెరుగుదల రేటును పతనావస్థగా పరిగణించనున్నట్లు ఆయన తెలిపారు.
ఎయిర్‌లైన్స్‌ను ప్రయివేటీకరించాలనే అనుకుంటున్నామని, ఈలోగా ఇండియన్‌ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా ఫ్లీట్‌ను పటిష్టపరుస్తామని ఆయన చెప్పారు. ఢిల్లీ, కలకత్తా, ముంబాయి, చెన్నైవిమానాశ్రయాలను కూడా ప్రైవేటీకరించనున్నట్లు ఆయన తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాల నుంచి భారత్ వెనక్కి మళ్లబోదని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
