గుజరాత్‌లో మళ్లీ అల్లర్లు- ఒకరి మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లో మళ్లీ అల్లర్లు, హింస చోటు చేసుకున్నాయి. శనివారంనాడు రాత్రి చెలరేగిన హింసలో ఒక వ్యక్తి మరణించాడు. అల్లరల్లో దాదాపు 30 మంది గాయపడ్డారు.
ఇదిలావుంటే, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే గుజరాత్ నుంచిసైన్యాన్ని ఉపసంహరించుకునే విషయంపై నిర్ణయం తీసుకుంటామని రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ చెప్పారు. ఆయన గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. పరిస్థితినిఅంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ఆ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శాంతి స్థాపన కోసం ఆయన హిందూ, ముస్లిం నాయకులతో చర్చలు జరిపారు. పునరావాస కేంద్రాలను సందర్శించారు.












Click it and Unblock the Notifications
