త్వరలో ఎమ్మెల్యేల విదేశీ పర్యటనలు
హైదరాబాద్: సంస్కరణల వల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా భవిష్యత్తులో మంచి ఫలితాలు వుంటాయనేవిషయం తెలుసుకోవడానికి రాష్ట్ర శాసనసభ్యుల బృందం విదేశీ పర్యటనలు చేయనున్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి 14 రోజుల పాటు వివిధ పార్టీల శాసనసభ్యులు ఐదు దేశాల్లో పర్యటిస్తారు.
విదేశాల్లోని అనుభవాలను అధ్యయనం చేసివీరు ప్రభుత్వానికి సూచనలు చేస్తారు. మలేషియాలో మౌలిక సదుపాయాల కల్పనను, దక్షిణా కొరియాలో ప్రజల భాగస్వామ్యం వల్ల వస్తున్న ఫలితాలను, చైనాలో విదేశీ పెట్టుబడుల తీరునువీరు పరిశీలిస్తారు. సింగపూర్, థాయ్‌లాండ్‌లో కూడావీరు పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications
