భద్రాచలం: భద్రాద్రి రాముడి కళ్యాణ మహోత్సవం పవిత్ర గోదావరి నదీ తీరాన కన్నుల పండువుగా జరిగింది.సీతారాముల కళ్యాణానికి భద్రాచలంలో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
కళ్యాణ వేదికను 36సెక్టార్లుగా విభజించి భద్రాద్రి రాముడి కళ్యాణాన్ని వేలాది భక్తులు వీక్షించడానికివీలుగా క్లోజ్‌డ్ సర్క్యూట్ టీవీలను ఏర్పాటు చేశారు. ప్రముఖ శిల్పి గణపతి స్తపతి ఆధ్వర్యంలో నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపంలోసీతారాముల కళ్యాణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీ సమేతంగాసీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు పులిహోర, మంచినీరుఅందించారు.