హైదరాబాద్: గుజరాత్ సంఘటనలపై పార్లమెంటులో ఏ నిబంధన కింద చర్చ జరగాలనేవిషయంపై తమకు పట్టుదల లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడుకె. ఎర్రంనాయుడు అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం నాడుకె. ఎర్రంనాయుడు, మరి కొంత మందితో సమావేశమయ్యారు.ఈ సమావేశానంతరం ఎర్రంనాయుడు విలేకరులతో మాట్లాడారు. ఏదో రూపంలోగుజరాత్ సంఘటనలపై చర్చ జరగాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. గుజరాత్‌విషయంలో పార్లమెంటులో నెలకొన్న పరిస్థితి రెండు రోజుల్లో సద్దుమణగ గలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.