రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడే ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండబోరని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు కాన్షీరామ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పితో కలిసి ప్రభుత్వ ఏర్పాటు తీరుపై బిజెపి కసరత్తు చేస్తుండగా కాన్సీరామ్ సోమవారం ఈ ప్రకటన చేశారు. మే 1వ తేదీ లోగా ఉత్తరప్రదేశ్‌లో మాయావతి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు బిజెపి పార్లమెంటరీ బోర్డు ఒకటి రెండు రోజుల్లో సమావేశం కానుంది. బోర్డు సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదని చెన్నై నుంచి ఢిల్లీకి చేరిన బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి చెప్పారు.












Click it and Unblock the Notifications
