ఇకపై ఏటా ఘనంగా ఎర్త్‌డేః బాబు

న్యూఢిల్లీ: లోక్‌సభస్పీకర్‌ పదవిపై నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అల్టిమేటమ్‌ ఇచ్చింది. లోక్‌సభస్పీకర్‌ పదవిని తీసుకుంటారో, లేదో రెండు వారాల్లోగా తమకు చెప్పాలని తెలుగుదేశం పార్టీకి చెప్పినట్లు బిజెపి అధికార ప్రతినిధివిజయ్‌కుమార్‌ మల్హోత్రా సోమవారం విలేకరులకు చెప్పారు.

మే 10వ తేదీ లోగా ఈవిషయంపై తెలుగుదేశం తన నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సన్నిహితులొకరు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫోన్‌ చేసి చెప్పినట్లు ఆయన తెలిపారు. లోక్‌సభస్పీకర్‌ పదవిని ఎన్‌సిపి నేత పి.ఎ. సంగ్మాకు ఇవ్వడానికి బిజెపి సుముఖంగా వున్నదనే వార్తలను పార్టీ వర్గాలు ఖండిస్తున్నాయి. తెలుగుదేశం ముందుకు రాకపోతే బిజెపియే తన అభ్యర్థిని పెడుతుందని ఆ వర్గాలు చెప్పాయి.

ఇదిలా వుంటే, బిజెపి అల్టిమేటంను పెద్ద పట్టించుకోవడం లేదు. గుజరాత్‌ సమస్య ఇప్పుడు ప్రధానమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు అన్నారు. ఇప్పుడు స్పీకర్‌ పదవి గురించి ఆలోచించడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు గుజరాత్‌లో శాంతి సామరస్యాలను నెలకొల్పడం అవసరమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+