చంద్రబాబుపై థాకరే ఆగ్రహం
న్యూఢిల్లీ: లోక్‌సభస్పీకర్ పదవిపై నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అల్టిమేటమ్ ఇచ్చింది. లోక్‌సభస్పీకర్ పదవిని తీసుకుంటారో, లేదో రెండు వారాల్లోగా తమకు చెప్పాలని తెలుగుదేశం పార్టీకి చెప్పినట్లు బిజెపి అధికార ప్రతినిధివిజయ్‌కుమార్ మల్హోత్రా సోమవారం విలేకరులకు చెప్పారు.
ఇదిలా వుంటే, బిజెపి అల్టిమేటంను పెద్ద పట్టించుకోవడం లేదు. గుజరాత్ సమస్య ఇప్పుడు ప్రధానమని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతకె. ఎర్రంనాయుడు అన్నారు. ఇప్పుడు స్పీకర్ పదవి గురించి ఆలోచించడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు గుజరాత్‌లో శాంతి సామరస్యాలను నెలకొల్పడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
