టిడిపి మద్దతు లేకున్నా నెగ్గుతాం
హైదరాబాద్: గుజరాత్‌విషయంలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నా తమ ప్రభుత్వానికి ప్రమాదం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.
గుజరాత్‌పై 184 నిబంధన కింద జరిగే చర్చపై వోటింగ్‌విషయంలో తెలుగుదేశం పార్టీ సరిగా ఆలోచించిసరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అన్నాడియంకె తమ మిత్ర పక్షం కాదని,అయినప్పటికీ సముచితమైన నిర్ణయం తీసుకున్నదని ఆయన అన్నారు.
గుజరాత్ అల్లర్లను ఆసరాగా చేసుకుని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో విభేదాలు సృష్టించడంలో కాంగ్రెస్ సఫలమైందని ఆయన అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వాన్నిఅస్థిర పరచడానికి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
