తెలంగాణ
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం త్వరంలోనే వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) నేతకె. చంద్రశేఖర్ రావు అన్నారు.
తెలంగాణ సాధనే తప్ప మరో వాదన తెలంగాణ రాష్ట్ర సమితికి లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శ ప్రాయంగా తీర్చి దిద్దుతామని ఆయన చెప్పారు. మహిళలు ఎక్కువగా అనుత్పాదక రంగంలో పని చేస్తున్నారని, వారికి తగిన ప్రాధాన్యం ఇస్తే అన్ని రంగాల్లో ముందుకు పోగలమని ఆయన అన్నారు. మహిళలు తన నుదుట దిద్దిన తిలకం, తనకు ఇచ్చిన దీవెనలు తనను ముందుకు నడిపిస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
