రాత్రంతా బాబు ఎదురుచూపులు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవనంలో ఢిల్లీ పరిణామాల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సమాధానం అయిపోగానే తమ పార్టీ లోక్‌సభ సభ్యులకు సూచన ఇవ్వడానికి ఆయన నిరీక్షిస్తూ వున్నారు.

మంగళవారం ఉదయం ఆయన పోలిట్‌ బ్యూరో సమావేశంఅయింది. ప్రధాని సమాధానం అయిపోగానే తగిన నిర్ణయం తీసుకోవాలని పోలిట్‌ బ్యూరో నిర్ణయించింది. వెంటనే నిర్ణయం తీసుకుని దాన్ని తెలియజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలోని తన లోక్‌సభ సభ్యులకు చెప్పారు. తిరిగి మంగళవారం రాత్రి పోలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. ప్రధాని సమాధానం ముగిసిన వెంటనే సముచిత నిర్ణయం తీసుకుని లోక్‌సభ సభ్యులకు చెప్పే అధికారాన్ని పోలిట్‌బ్యూరో చంద్రబాబుకుఅప్పగించింది.

చంద్రబాబు వెంటనే తన నిర్ణయం తీసుకోవడానికి లోక్‌సభలో జరుగుతున్న చర్చను గమనిస్తూ కూర్చున్నారు. మీడియా దృష్టిఅంతా తెలుగుదేశం పార్టీ నిర్ణయం మీదనే వుండడంవిశేషం.
గుజరాత్‌పై 184వ నిబంధన కింద మంగళవారం ఉదయం ప్రారంభమైన చర్చ రాత్రి పొద్దు పోయేవరకు సాగింది. దీంతో గంటల తరబడి ఉత్కంఠ కొనసాగుతూనే వున్నది. తెలుగుదేశం తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం వల్ల ఈ ఉత్కంఠ మరింతగా చోటు చేసుకుంది. చర్చను ముగించేందుకు ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జరిగింది. మరింత కొంత సమయం కావాలని ప్రతిపక్షాలు అడగడంతో మరింత జాప్యం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+