సోనియాపై జార్జి వ్యాఖ్యలు- రభస
న్యూఢిల్లీ: ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీపై రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చేసిన వ్యాఖ్యలతో మంగళారం రాత్రి లోక్‌సభలో తీవ్ర రభస జరిగింది. గుజరాత్ వ్యవహారంపై 184వ నిబంధన కింద చర్చ జరుగుతున్న సమయంలో ఫెర్నాండెజ్ సోనియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తొలిసారి జరుగుతున్నట్లు గుజరాత్ గురించి కథలు చెబుతున్నారు. ఢిల్లీ వీధుల్లో 1984లో జరగలేదా? అని ఆయన అన్నారు. మంత్రి సంబంధితఅంశానికి పరిమితం కావడం లేదని కాంగ్రెస్ సభ్యులు అనడంతో అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ప్రతి పక్షనేత కార్యాలయం హోదాను నిలబెట్టేదిగా సోనియా గాంధీ ప్రవర్తన లేదు. ఆమెది బాల్య చేష్ట. సభా సంప్రదాయాన్ని కాపాడడం లేదు. సభలో గమ్ నమలవద్దని ఆమెకు ఎవరో ఒకరు చెప్పాలి అని ఒకానొక సందర్భంలో క్రీడల, యువజన వ్యవహారాల మంత్రి ఉమాభారతి అన్నారు. గందరగోళంలో సమతా పార్టీ సభ్యుడు ప్రభునాథ్ సింగ్ సోనియా గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. సోనియాపనై జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి వేసిన దావా గురించి ఆయన ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ తీవ్ర నిరసన తెలియజేసింది. కాంగ్రెస్ ఉప నేత శివరాజ్ పాటిల్ మాట్లాడడానికి నిలబడ్డప్పుడు అధికార పక్ష సభ్యులు తీవ్రంగా అడ్డుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ పి.ఎం. సయీద్ ఎంత చెప్పినా సభ్యులువినలేదు. దీంతో వివిధ పార్టీల నాయకులను తన ఛేంబర్‌లోకి పలిచారు. చర్చతో సంబంధం లేని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని శివరాజ్ పాటిల్ సూచించారు.












Click it and Unblock the Notifications
