పార్టీలను ఖాతర్ చేయని ప్రజలు: ముషారఫ్
ఇస్లామాబాద్: తన పాలనను మరో ఐదేళ్లు పొడిగించుకోవడానికి తలపెట్టిన ప్రజాభిప్రాయసేకరణలో పెద్ద యెత్తున ప్రజలు పాల్గొన్నారని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ అన్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన బహిష్కరణ పిలుపును ప్రజలు తిప్పి కొట్టారని ఆయన అన్నారు.
తన భార్యతో, తల్లితో కలిసి ముషారఫ్ తన వోటును రావల్పిండిలో వేశారు. డ్రాయింగ్ రూమ్ పార్టీలుగా మారిన రాజకీయ పార్టీలతో ప్రజలువిసిగిపోయారని ఆయన అన్నారు. రెఫరెండమ్‌ను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బహిష్కరించాయి. ప్రజాభిప్రాయసేకరణ చట్ట విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమనిఅంటూ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనకూడదని మాజీ ప్రధానులు బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications
