హైదరాబాద్: నిషిద్ధపీపుల్స్‌వార్ నక్సలైట్లు మంగళవారం రెండు జిల్లాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు.విజయనగరం, గుంటూరు జిల్లాల్లో వారు దుశ్చర్యలకు పాల్పడ్డారు.
విజయనగరం జిల్లాలో ధర్మారావు అనే మాజీ నక్సలైట్‌ను వారు హతమార్చారు. అతడ్ని హతమార్చిన తర్వాత స్కూటర్లను, ట్రాక్టర్లను బాంబులువిసిరి ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లాలో దాదాపు 70 మంది నక్సలైట్లు మాజీ సానుభూతిపరుడు మంగయ్యపై దాడి చేశారు. బాంబులువిసిరారు. వాహనాలను ధ్వంసం చేశారు.