గుజరాత్‌కు 150 కోట్ల పునరావాస పథకం
న్యూఢిల్లీ: గుజరాత్‌కు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి 150 కోట్ల పునరావాస పథకాన్ని ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గుజరాత్ పరిణామాలపై 184వ నిబంధన కింద ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానంపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం తెల్లవారు జామున ఆయన సమాధానమిచ్చారు.
గుజరాత్ విషయంలో తాను మాట మార్చాననే విమర్శలో నిజం లేదని, తాను గుజరాత్‌లో ఏమన్నానో అదే గోవాలో అన్నానని ఆయన చెప్పారు. తాను జాతి, మత భేదాలు పాటించలేదని ఆయన స్పష్టం చేశారు.
మీడియాపై ఆయన విమర్శలు చేశారు. మీడియా పాత్రపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. సమాచారం ఇచ్చేపేరుతో ఏది పడితే అది రాయడం మంచిది కాదని ఆయన అన్నారు. మీడియాపై నియంత్రణ వుండాలని తాను అనడం లేదని, మీడియా సంప్రదాయం పాటించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
