న్యూఢిల్లీః గుజరాత్‌లో సాగుతున్న నరమేధాన్ని నిరోధించడంలో పూర్తిగా విఫలమైన బిజెపి నేతలు తమ చేతగాని తనాన్ని అంగీకరించకుండా హింసాగ్నికి మరింత ఆజ్యం జోడించే ప్రయత్నం చేస్తున్నారు.
గోధ్రాలో జరిగిన మారణకాండకు దేశభక్తుల్లోపెల్లుబికిన ఆగ్రహమే గుజరాత్ హింసాకాండకు కారణమని బిజెపిసీనియర్ నేత జెపి మాథుర్ వ్యాఖ్యానించారు. గుజరాత్ హింసను మతకల్లోలాలుగా చిత్రించడాన్ని ఆయన తప్పుబట్టారు. గోధ్రా మారణహోమానికి జాతీయ శక్తుల ప్రతిస్పందనను పత్రికలు తప్పుగా చిత్రిస్తున్నాయని ఆయన చెప్పారు. జాతీయ శక్తులపై దాడి చేస్తూ దేశవిద్రోహ శక్తులకు మరింత బలాన్ని ఇస్తున్నసోకాల్డ్ సెక్యులర్‌వాదులపై ఆయన తీవ్రంగా దుమ్మెత్తిపోశారు. ఐకె గుజ్రాల్, చంద్రశేఖర్, సోనియాగాంధీ, ములాయం సింగ్ యాదవ్ వంటి వారంతా దేశద్రోహ శక్తులతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. కెపిఎస్ గిల్‌ను గుజరాత్‌సెక్యురిటీ సలహాదారుగా నియమించడం పట్ల మాథుర్ హర్షం వ్యక్తం చేశారు.