న్యూఢిల్లీః
తెహల్కా
డాట్
కాం
రక్షణ
శాఖ
కుంభకోణంపేరుతో
చేసిన
వ్యవహారం
అంతా
పాకిస్తాన్
కు
తోడ్పడేదిగా,
మన
రక్షణ
శాఖ
పరువును
బజారుకీడ్చేదిగా
వున్నదని
జార్జి
ఫెర్నాండెజ్
అన్నారు.
తెహల్కా
కుంభకోణంపై
ఏర్పాటైన
వెంకటస్వామి
కమిషన్
ముందు
జార్జి
ఫెర్నాండెజ్
మొట్టమొదటి
సారిగాహాజరయ్యారు.
ఒక
పోర్టల్
ఏ
మాత్రం
త్రికరణ
శుద్ధి
లేకుండా
చేసిన
పనివల్ల
రక్షణ
శాఖ
సిబ్బంది,
దేశ
రక్షణ
శాఖ
నైతికస్థైర్యం
ఎంతో
దెబ్బతిన్నదని
ఆయన
వెంకటస్వామి
కమిషన్
కు
చెప్పారు.
రక్షణ
శాఖలో
అవినీతి
జరుగుతున్నదనే
ఆధారాలు
వున్నట్లయితే
సుప్రీంకోర్టుకో,
రాష్ట్రపతికో,
నమ్మకం
వుంటే
ప్రధానికో
వాటిని
సమర్పించి
వుంటే
బాగుండేదని
ఫెర్నాండెజ్
అభిప్రాయపడ్డారు.
అలా
కాకుండా
అడ్డదారిలో
ఏవో
కొన్ని
ఆధారాలు
సాధించేందుకు
ప్రయత్నించి
రక్షణ
శాఖ
నైతికస్థైర్యంపై
దెబ్బతీసిందని
ఆయన
తెహల్కానువిమర్శించారు.