వార్ తో చర్చల భారం బాబుదేః కాంగ్రెస్
హైదరాబాద్‌ః ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకువీలుగా కాల్పుల విరమణ చేస్తామంటూ పీపుల్స్ వార్ చేసిన ప్రకటన పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హర్షం ప్రకటించింది.పీపుల్స్ వార్ స్పందనను తెలుగుదేశం ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు కోరారు. పీపుల్స్ వార్ స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని, గతంలో మాదిరిగా తాత్సారం చేయకుండా ప్రభుత్వం స్పందించాలని బుధవారం గాంధీభవన్ లో పిసిసి ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ రావువిలేకర్లతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
