లోక్ సభ స్పీకర్ మనోహర్ జోషి
న్యూఢిల్లీః శవపేటికల కుంభకోణం బుధవారం రాజ్యసభను కుదిపివేసింది. రక్షణ శాఖ మంత్రి ఫెర్నాండెజ్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలు స్తంభింప చేశాయి. తెహల్కా కుంభకోణంలో నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం సిబిఐని ఆదేశించడంపై ప్రధాని తక్షణం ఒక ప్రకటన చేయాల్సిందిగా ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఈఅంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు సురేష్ జీరోఅవర్ లో లేవనెత్తారు.
ఇందుకు జార్జిఫెర్నాండెజ్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా వాజ్‌పేయి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. బిజెపి సభ్యులు ప్రతిపక్షాల వైఖరికి నిరసన వ్యక్తం చేయడంతో సభలో ఏమీ వినపడని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చివరకు ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.












Click it and Unblock the Notifications
