వార్‌ కాల్పుల విరమణ

న్యూఢిల్లీః శవపేటికల కుంభకోణం బుధవారం రాజ్యసభను కుదిపివేసింది. రక్షణ శాఖ మంత్రి ఫెర్నాండెజ్‌ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలు స్తంభింప చేశాయి. తెహల్కా కుంభకోణంలో నిందితులపై కేసు నమోదు చేయాల్సిందిగా న్యాయస్థానం సిబిఐని ఆదేశించడంపై ప్రధాని తక్షణం ఒక ప్రకటన చేయాల్సిందిగా ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఈఅంశాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు సురేష్‌ జీరోఅవర్‌ లో లేవనెత్తారు.

ప్రభుత్వ వైఖరి ప్రతిపక్ష సభ్యులుపెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో సభా కార్యక్రమాలు సుమారు గంటసేపు స్తంభించిపోయాయి. ప్రభుత్వం ఎంతకూ నోరుమెదపక పోవడంతో అన్నా డిఎంకెమినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి. కార్గిల్‌ యుద్ధ సమయంలో మతవీరుల కోసం ఒకొక్కటి 2,500 డాలర్ల వ్యయంతో 500 శవపేటికలను కొనుగోలు చేశారంటూ బుధవారం ఒక వార్తా పత్రిక ప్రకటించింది. ఈ కధనంపై వాస్తవాలను వెల్లడించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టారు.

ఇందుకు జార్జిఫెర్నాండెజ్‌ సమాధానం చెప్పేందుకు ప్రయత్నించగా వాజ్‌పేయి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. బిజెపి సభ్యులు ప్రతిపక్షాల వైఖరికి నిరసన వ్యక్తం చేయడంతో సభలో ఏమీ వినపడని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా చివరకు ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+