న్యూఢిల్లీః అవిచ్ఛిన్నంగా సాగుతున్న గుజరాత్ హింసాకాండను అణిచివేసేందుకు ప్రత్యేక సలహాదారు కెపిఎస్ గిల్ సూచనమేరకు పెద్ద సంఖ్యలో కమెండో బలగాలను గుజరాత్‌కు తరలించారు. 2000 మంది కమెండోలు, అల్లర్లను చెదరగొట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన జవాన్లు గుజరాత్‌కు బయలుదేరి వెళ్లారు.
మరో వెయ్యిమంది ప్రత్యేక పోలీసులు పంజాబ్ నుంచి బయలుదేరనున్నట్టుగా తెలిసింది. కొత్తగా గుజరాత్ చేరుతున్న బలగాలు కెపిఎస్ గిల్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. ఇదిలా వుండగా గుజరాత్‌లో గురువారం నాడు కూడా హింసాకాండ కొనసాగింది. అహ్మదాబాద్‌లో రెండు చోట్ల నాటుబాంబులుపేలిన సంఘటనల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరోచొట ఒక వ్యక్తిని కత్తులతో పొడిచి చంపి ఆ తర్వాతపెట్రోల్ పోసి తగులబెట్టారు. పలు ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతున్నా అల్లర్లు మాత్రం ఆగడం లేదు.