గుజరాత్‌ అల్లర్లు- 9 మంది మృతి

విజయనగరం:విజయనగరం జిల్లాలో బుధవారం జరిగినవేర్వేరు అగ్ని ప్రమాదాల్లో 16 మంది మృతి చెందారు. 600కుపైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. సీతానగరం మండలం నిడగల్లులో రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో గ్రామం మొత్తం భస్మీపటలమైనట్లు సమాచారం. 500కుపైగా ఇళ్లు కాలిపోయాయి. మంటలకు 16 మంది మృతి చెందారు. 20కిపైగా గాయపడినట్లు సమాచారం.

బొబ్బిలి మండలం సీతయ్యపేటలో జరిగిన మరో ప్రమాదంలో 50 పూరిళ్లు, 50 పశువులు దగ్ధమయ్యాయి. ఇద్దరు గాయపడ్డారు. ఇంటిలో ఉన్న తన భార్య, పిల్లలను రక్షించడానికి మంటల్లోకి వెళ్లిన తియ్యాల ఆదినారాయణ గాయపడ్డారు. నేమాపుఅరుణ్‌కుమార్‌ అనే మూడేళ్ల బాలుడు గాయపడ్డాడు. గ్రామంలోని వృద్ధులు, పిల్లలు తలో దిక్కు పరుగెత్తారు. దాంతో ఎవరు సురక్షితంగా ఉన్నారో, ఎవరు ప్రమాదంలో చిక్కుకున్నారో తెలియలేదు.

పార్వతీపురం మండలం లికిడివలసలో జరిగిన మరో ప్రమాదంలో 45 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఒకరు మరణించారు.పాలకొండ, పార్వతీపురం, రాజాం, సాలూరు, బొబ్బిలి, గజపతినగరాల నుంచిఅగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. క్షతగాత్రులనువిజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం ఆస్పత్రులకు తరలించారు. నాలుగుఅంబులెన్స్‌లను సహాయక కార్యక్రమాల కోసం నియోగించారు. మరిపివలసకు చెందిన 20 యేళ్ల యువకుడు మంటలను ఆర్పడానికి వెళ్లి నూతిలో పడిపోయాడు. అతని జాడ తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+