వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పన్నుల శాఖపై గంగూలీ లాయర్ల పోరు
కోల్ కతాః ఆదాయం పన్ను బకాయి వున్న క్రికెటర్ల జాబితాలో భారత కెప్టెన్ గంగూలీపేరు ను తక్షణం తొలగించాలని ఆయన లాయర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గంగూలీ తరపు లాయర్లు ఆదాయం పన్ను శాఖ అధికారులకు ఓ లేఖరాశారు. గంగూలీ, కపిల్ దేవ్, అజర్ తో పాటు 33 మంది క్రికెటర్లు 3.8 కోట్ల రూపాయల బకాయి పడ్డట్లు ఆర్థికశాఖ మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవల రాజ్యసభలో ప్రకటించినవిషయం విదితమే. బకాయిదార్ల జాబితాలో గంగూలీపేరు వుండడం పట్ల ఆయన లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Thursday, May 9, 2002, 23:53 [IST]