గుజరాత్ అల్లర్లు- 9 మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్‌లో తాజాగా వెల్లువెత్తిన హింసకు తొమ్మిది మంది బలయ్యారు. ఇందులో ఐదుగురు పోలీసు కాల్పుల్లో మరణించగా, నలుగురు దుండగుల చేతుల్లోఅసువులు బాశారు.
అహ్మదాబాద్‌లోని మణినగర్ ప్రాంతంలో అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. బుధవారం ఉదయం బాంబు పేలుడు కారణంగా భయోత్పాతం నెలకొన్నది. అల్లరి మూకలువిధ్వంసానికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
అల్లర్లకు సంబంధించి మణినగర్ ప్రాంతంలో 33 మందినిఅరెస్టు చేశారు. వారి నుంచి నాటు పిస్టల్‌ను, లైవ్ కాట్రిడ్జెస్‌ను, 33 నాటు బాంబులను, ఒక కత్తినిస్వాధీనం చేసుకున్నారు.
మెజారిటీ వర్గానికి చెందిన ప్రజలు నివసించే ప్రాంతం నుంచి నడిచి వెళ్తున్న ఒక యువకుడిని కత్తులతో పొడిచి బుధవారం రాత్రి హత్య చేశారు. కలుపూర్ ప్రాంతంలో చెలరేగిన హింసలో 19 మంది గాయపడ్డారు. సబర్‌కాంతా జిల్లా భిలోడా పట్టణంలో ఒక వ్యక్తి కత్తిపోట్లకుగురై మరణించాడు. అహ్మదాబాద్ రూరల్ జిల్లా గ్యాస్‌పురాలో ఇద్దరు గాయపడ్డారు.
పరస్పరం రాళ్లు రువ్వుకుంటున్న రెండు గుంపులను చెదరగొట్టడానికి అహ్మదాబాద్‌లోని మాధవపురా పోలీసుస్టేషన్ పరిధిలోని ఇద్గా చౌకి, ఢిల్లీ దర్వాజా ప్రాంతాల్లో పోలీసులు టియర్ గ్యాస్‌షెల్స్ వదిలారు; కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications
