హైదరాబాద్‌ః పాలిటెక్నిక్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నాడు హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షా ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి విడుదల చేశారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలోనివిద్యార్ధులకు ఈ సారి తొలి మూడు ర్యాంకులు లభించాయి. ఈ సారి ప్రవేశపరీక్షలో బాలికలు మంచి ప్రతిభ కనపరిచారు. అయితే తొలి పదిర్యాంకులో ఎనిమిది ర్యాంకులు మాత్రం బాలలకే దక్కాయి. ఈ ఎంట్రెన్స్‌లో బాలికల ఉత్తీర్ణత 88 శాతం వుండగా బాలల ఉత్తీర్ణత 84 శాతం మాత్రమే వుంది. జువెలరీ డిజైనింగ్, ఇంటీరియర్ డెకొరేషన్, లాండ్‌స్కేపింగ్, బయోటెక్నాలజీకోర్సులను ప్రవేశపెట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 21 రకాలకోర్సులను ఆఫర్ చేస్తున్నారు.