గుజరాత్‌లో మరో ముగ్గురి మృతి
న్యూఢిల్లీ: గుజరాత్ హింసపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేతవిచారణ జరిపించాలని, ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తప్పించాలని తాము చేసిన డిమాండ్‌ను జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం తిరస్కరించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగావిమర్శించారు. తమ డిమాండ్లను అంగీకరించి వుంటే గుజరాత్‌లో ప్రజలవిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి వీలయ్యేదని ఆమె అన్నారు.
జమ్మూలో మిలిటెంట్ల దాడులను ఆమె ప్రస్తావిస్తూ- ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య మౌలిక తేడా ఉన్నదని, బలమైన ప్రభుత్వ, ప్రయివేట్, సహకార రంగాలను కాంగ్రెస్ కోరుకుంటోందని, బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని ప్రయివేట్ సంస్థలకుఅమ్మివేస్తోందని ఆమె అన్నారు. ఎన్‌డిఎ చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆమె చెప్పారు.
ఎఐసిసి సదస్సు ఈ నెల 24వ తేదీన జరుగుతుందని, దేశ పరిస్థితులను సమీక్షించడంతో పాటు ఈ సదస్సులో ప్రజా సమస్యలపై చర్చ చేస్తామని ఆమె చెప్పారు.