హైదరాబాద్: రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విద్యుత్ ఉద్యోగులను, వారి మద్దతుదారులను పోలీసులు బుధవారం మూకుమ్మడిగా అరెస్టు చేశారు.
విద్యుత్ సంస్కరణలను, సంస్కరణల్లో భాగంగా ఉద్యోగుల సర్దుబాటును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోనివిద్యుత్ ఉద్యోగులు 15 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగావిద్యుత్ ఉద్యోగులు బుధవారం సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్యాలయం ఆవరణలో ఆందోళనలు చేపట్టరాదని,అందుకు విరుద్ధంగా ఆందోళనకు దిగినందుకువిద్యుత్ ఉద్యోగులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్నవారినిఅరెస్టు చేయడాన్ని విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు నిరసించారు. తమ ఆందోళన ఆగదని వారు చెప్పారు.