హైదరాబాద్‌ః విద్యుత్ వ్యవహారంపై కాంగ్రెస్ రాజకీయాన్ని, రాద్ధాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా విమర్శించారు. ఉచిత విద్యుత్ పేరుతో ప్రజలను కాంగ్రెస్ వంచిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రజల పట్ల నేరానికి పాల్పడుతున్నదని ఆయన తీవ్రంగాపేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌పై పంజాబ్ ముఖ్యమంత్రి ముందుగా ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యమని ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ వారు గుణపాఠం నేర్చుకోకుండా పాతపాటనే పాడుతున్నారని ఇది దగా తప్ప మరోటి కాదని ఆయన అన్నారు. కర్ణాటక, తమిళనాడుకు కూడా ఆంధ్రప్రదేశ్‌విద్యుత్ సరఫరా చేస్తున్నదని ఆయన చెప్పారు. సమ్మె చేస్తున్నవిద్యుత్ ఉద్యోగులను కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు.ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులకు భారీ ఎత్తున వేతనాలు లభిస్తున్నాయని ఆయన చెప్పారు. బోలెడు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలకువిరుద్దంగా ఉద్యోగులు ప్రవర్తించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులు హద్దులు దాటుతున్నారని పిపిఎలు వారికి సంబంధించినవిషయం కాదని అది ప్రభుత్వ వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు.