ప్రభుత్వ ఉద్యోగులకు డిఎపెంపు

హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవుభత్యాన్ని 3.272 శాతం హెచ్చిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు, స్థానిక సంస్థల ఉద్యోగులకు, ఎయిడెడ్‌ సంస్థల సిబ్బందికి కూడా ఈ డిఎ పెంపు వర్తిస్తుంది. డిఎ పెంపువల్ల ప్రభుత్వం పై ఏటా 200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.

ఈ ఏడాది జనవరి నుంచే ఈపెరుగుదల అమల్లోకి వస్తుంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. బుధవారం నాడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే జన్మభూమి నుంచి 2450 కోట్ల రూపాయలతో మరో బృహత్‌ దారిద్ర్య నిర్మూలన పథకాన్ని చేపడుతున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. 500 మండలాల్లో ఈ పథకం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. 43 కోట్ల రూపాయలతోసర్వశిక్ష అభియాన్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. బ్రహ్మకుమారీలకు వారి సంస్థ ఏర్పాటుకువీలుగా 36 ఎకరాల స్థలాన్ని మంజూరు చేయాలని నిర్ణయించారు. వడదెబ్బ కారణంగా మృతిచెందిన 373 మందికి ఆపద్బంధు పథకం కింద సాయంఅందజేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+