జమ్మూ: జమ్మూ సమీపంలోని కలొచక్‌సైనిక శిబిరంపై టెర్రరిస్టుల దాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నదని భారత రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ బుధవారంనాడు ఆరోపించారు.
ఈ సంఘటనలో 39 మంది మరణించినవిషయం తెలిసిందే. పరిస్థితిని అక్కడికక్కడఅంచనా వేయడానికి ఇక్కడికి చేరుకున్న ఫెర్నాండెజ్- పాకిస్థాన్ నుంచి ఇటువంటిది తప్ప మంచిదేదీ ఎదురవుతుందని అనుకోలేదని అన్నారు. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు. ఇటువంటి దారుణ కృత్యాలు చేయడానికి పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికాధికారులను, వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.