నిజామాబాద్: నిజామాబాద్ సాయుధ రిజర్వ్ పోలీసు హెడ్‌క్వార్టర్‌లో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్రెనేడ్‌పేలి ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో అయిదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.
మృతి చెందిన కానిస్టేబుల్ ప్రకాశ్ రావు (25) ప్రకాశం జిల్లా చీరాలకు చెందినవాడు. ఎస్‌పి శంఖబ్రత బాగ్చీ చెప్పినవివరాల ప్రకారం- గ్రేహౌండ్స్‌కు చెందిన కానిస్టేబుళ్లు మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఆయుధాలు శుభ్రం చేస్తుండగా ఒక గ్రెనేడ్‌పేలింది. దాంతో గ్రెనేడ్‌ను పట్టుకున్న ప్రకాశ్ రావు తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు. ఈ ప్రమాదం సంభవించినప్పుడు అక్కడ గ్రేహౌండ్స్‌కు చెందిన ఇద్దరు ఆస్టల్ కమాండర్స్, 22 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఎస్. కృష్ణ(విశాఖపట్నం రూరల్), బి. లింగయ్య (నల్లగొండ) తీవ్రంగా గాయపడ్డారు.కె.సి. భూషణరావు, పి. గురు, ఎస్.ఎం. ప్రభులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.