వైభవంగా అప్పన్న చందనోత్సవం

సింహాచలంః సింహాచలేశ్వరుని నిజరూప దర్శనం (చందనోత్సవం) బుధవారం తెల్లవారు జామున అత్యంత వైభవంగా పాంచరాత్ర ఆగమశాస్త్ర విధానం ప్రకారం జరిగింది. స్వామివారిని తెల్లవారు జామున రెండుగంటలకు సుప్రభాత సేవతో మేల్కొలిపిన అనంతరం విష్వక్సేన పూజ, ఆరాధన నిర్వహించారు.

వేదపండితుల మంత్ర పఠనం మధ్యస్వామివారి అర్చకులు మోర్తా సీతారామాచార్యులు, గొడవర్తి రాధాకృష్ణమాచార్యులు కళ్లకు గంతలు కట్టుకుని, వెండి తొళ్లికతో చందనోత్తరణ (చందనవొలుపు) కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి అభ్యంగన స్నానమాచరించి, పళ్లరసాలతో అభిషేక కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతస్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ సంప్రదాయం ప్రకారం అనువంశిక ధర్మకర్తలైనవిజయనగరం రాజకుటుంబికులు పూసపాటి ఆనందగజపతిరాజు దంపతులు ఆయన ఇతర సభ్యులు తొలి దర్శనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికిస్వాగతం పలికారు. స్వామి వారి నిజరూపాన్ని దర్శించి రాజకుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్‌ సునీల్‌ శర్మస్వామివారికి పట్టువస్త్రాలు, సుగంధ చందనాన్ని సమర్పించారు. ప్రత్యేక దర్శనాలు ముగిసిన తర్వాత భక్తులనుస్వామివారి నిజరూప దర్శనానికి అనుమతించారు.ఏడాదిలో కేవలం ఒక్క వైశాఖ శుద్ద తదియ రోజున మాత్రమే లభించేస్వామి వారి నిజరూప దర్శనం కోసం వేల సంఖ్యలో భక్తులు మంగళవారం రాత్రినుంచి క్యూలో వున్నారు. బుధవారం రాత్రివరకు దర్శనం జరిగింది. రాత్రి అత్యంత వైభవంగా పంచామృతాభిషేకం, సహస్రఘటాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాతస్వామివారికి వేదమంత్రాల మధ్య తొలివిడతగా మూడు మణఉగులు సుగంధభరిత చందనాన్ని అలంకరిస్తారు. వైశాఖ పౌర్ణమి, జ్యేష్టపౌర్ణమి, ఆషాడపౌర్ణమి నాడు మూడేసి మణుగుల చొప్పున చందనాన్నిస్వామివారికి అలంకరిస్తారు. మొత్తం పన్నెండు మణుగుల చందనాలంకారంతోస్వామివారి నిత్యరూపం భక్తులను అలరిస్తుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+