అమలాపురంః
లోక్‌సభ
స్పీకర్
బాలయోగి
మృతి
కారణంగా
ఖాళీ
అయినఅమలాపురం
లోక్‌సభ
స్థానంలో
ఎన్నికను
ఏకగ్రీవంగా
జరపాలని
తెలుగుదేశం
పార్టీ
చేసిన
ప్రయత్నాలు
విఫలం
అయ్యాయి.
కాంగ్రెస్,
వామపక్షాలు
తెలుగుదేశం
అభ్యర్ధి,
బాలయోగి
సతీమణివిజయకుమారిపై
పోటీ
చేయకుండా
ఏకగ్రీవానికి
సహకరించే
ప్రయత్నం
చేశారు.
తెలుగుదేశం
పార్టీ
కూడా
అనేక
మంది
ఇండిపెండెంట్
అభ్యర్ధులను
రంగంలోంచి
తప్పించింది.
అయితే
బిఎస్‌పి,
రిపబ్లికన్
పార్టీ
అభ్యర్ధులవిషయం
లో
మాత్రం
తెలుగుదేశం
ప్రయత్నాలు
ఫలించలేదు.
ఈ
రెండు
పార్టీల
అభ్యర్ధులతో
పాటు
మరికొందరు
ఇండిపెండెంట్లు
కూడా
ఇప్పుడు
రంగంలోమిగిలారు.
అయితే
ప్రధానంగా
పోటీ
మాత్రం
బిఎస్‌పి,
ఆర్‌పిఐ
నుంచి
వుంటుందని
తెలుగుదేశం
వర్గాలు
భావిస్తున్నాయి.
తమ
అభ్యర్ధి
గెలుపు
ఖాయమని
అయితే
ఇలా
పోటీ
జరగడమే
దురదృష్టకరమని
తెలుగుదేశం
నేతలుఅంటున్నారు.
బిఎస్‌పి
తరఫున
జెబి
రాజు,
ఆర్‌పిఐ
తరఫున
పివి
చక్రవర్తి
ఇప్పుడు
పోటీలో
వున్నారు.