కాషాయీకరణపై సునిశిత పరిశీలన: గిల్
అహ్మదాబాద్: రాష్ట్ర పోలీసుల కషాయీకరణఅరోపణలను మునుపటి కన్నా మరింత సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి భద్రతా సలహాదారు కె.పి.యస్. గిల్ అన్నారు. మతపరంగా అత్యంత సున్నిత రాష్ట్రమైన గుజరాత్‌లో తగిన మేరకు పోలీసులు బలగాలు లేవని ఆయన అన్నారు.
గుజరాత్ పోలీసుల కాషాయీకరణపై వస్తున్న ఆరోపణల గురించి ప్రస్తావించగాసీనియర్ అధికారుల ఆదేశాల మేరకు పోలీసు బలగాలు పని చేస్తాయని, ఏదైనా వుంటే ఉన్నత స్థాయిలోని వుంటుందని ఆయన చెప్పారు. పరిస్థితి త్వరలో మెరుగుపడగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
