తిరుమలః తిరుమలలో శ్రీవారి పుష్కరిణి నీటిని శుభ్రపర్చేందుకు ఉపయోగించే గ్యాస్ లీక్‌కావడంతో దాదాపు 125 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో నలుగురు పి్‌లలతో సహా 24 మంది పరిస్థితి క్లిష్టంగా వుంది. సాయంత్రంఅయిదు గంటల సమయంలో పుష్కరిణిలో స్నానం చేస్తున్న వారు, కోనేటి ఒడ్డున వున్నవారు ఒక్కసారిగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారని తెలిసింది. కొందరు ఊరిరాడక స్పృహతప్పారు. ఏదో జరుగుతున్నదనే భయంతో మరికొందరు యాత్రికులుఅరుపులు కేకలతో దూరంగా పరిగెత్తారు. అందుబాటులో వున్నఅంబులెన్స్‌లో బాధితులను వెంటనే తిరుపతి ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి కొండపైనే వైద్యసాయం ఏర్పాటు చేశారు. మరికొన్నిఅంబులెన్స్‌లను కూడా రప్పించారని తెలిసింది ఉన్నతాధికారులు ఈ లీక్ ఎలా జరిగిందో ఆరా తీస్తున్నారు. తీవ్రఅస్వస్థత పాలైన వారిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు, గుంటూరు జిల్లాకు చెందిన కుటుంబం వున్నట్టుగా తెలిసింది.