తీవ్రవాదంపైప్రతిపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ప్రభుత్వంఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే జమ్మూలో 14వ తేదీన దాడి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకన్నింటికీ తమ మద్దతు వుంటుందని తెలియజేశాయి.
జమ్మూలో 14వ తేదీన జరిగిన తీవ్రవాద దాడిపై ప్రత్యేక చర్చను ప్రతిపక్ష నేత సోనియా గాంధీ ప్రారంభించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడానికి తాము ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని చక్కదిద్దడానికి కచ్చితమైన వ్యూహంతో ముందుకు రావాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
