శ్రీనగర్: శ్రీనగర్ సచివాలయం వద్ద శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఇద్దరు మరణించారు. 17 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన శుక్రవారంనాడు సంభవించింది.
శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై అమర్చినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తిఅక్కడికక్కడే మరణించాడు. మరొక వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.