న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషనర్ జహంగీర్ ఖాజీని స్వదేశం తిరిగి వేళ్లాల్సిందిగా ఆదేశించాలని భారత్ శనివారం నిర్ణయించుకుంది.
ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. సమార్హత కోసం ఖాజీ పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాల్సి వుంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సూచన చేసినట్లు సమావేశానంతరం విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్‌విలేకరులకు చెప్పారు.