అందరితో కేంద్రం చర్చించాలి: బాబు
హైదరాబాద్: సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పాకిస్థాన్‌పై చర్య తీసుకునేవిషయంలో ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వంవిశ్వాసంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నాయకత్వంమిమ్మల్ని సంప్రదించిందా అని విలేకరులు అడిగితే తమ పార్టీ నాయకులు ప్రభుత్వంతో మాట్లాడుతూనే వున్నారని చంద్రబాబు జవాబిచ్చారు.
పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి ఇదే తగిన సమయమనిమీరు భావిస్తున్నారా అని అడిగితే కొన్ని సార్లు ఎక్కువ మాట్లాడి తక్కువ చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఏం చేయాలనిమీరు భావిస్తున్నారని ప్రశ్నిస్తే ఆ విషయం గురించి ఆలోచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నదని, వ్యక్తులు తమ తమ అభిప్రాయాలను ప్రచారం చేయడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
