మూడు ఊళ్లు దగ్ధం
హైదరాబాద్: గుంటూరు, ప్రకాశం,శ్రీకాకుళం జిల్లాల్లో మూడు ఘోర అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దాదాపు 850 ఇళ్లుఅగ్ని ఆహుతి అయ్యాయి. ధాన్యం, నగలు, నగదు దగ్ధమయ్యాయి. దాదాపు 2.25 కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం సంభవించింది. ప్రజలు గూడు కోల్పోయారు.పెద్ద యెత్తున పశువులు సజీవ దహనమయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా వంగర మండలం అరసాడ గ్రామంలో సంభవించినఅగ్నిప్రమాదంలో 350 ఇళ్లు దగ్ధమయ్యాయి. 500 కుటుంబాలు వీధిన పడ్డాయి. కొంత మంది జీడిపిక్కలు కాల్చే ప్రయత్నం చేస్తుండగాపేలిన జీడిపిక్క ఒకటి ఇంటిపై పడింది. వెంటనే మంటలు ఊరంతా వ్యాపించాయి.
గుంటూరు జిల్లా కొల్లిపరలో జరిగిన మరో అగ్ని ప్రమాదంలో సుమారు 200 పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామంలో దళితవాడ తూర్పు భాగం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.విద్యుత్ తీగలపై కొబ్బరి మట్టలు పడడంతో మంటలు చెలరేగి వ్యాపించాయి.












Click it and Unblock the Notifications
