నల్లగొండ:
నల్లగొండ
జిల్లా
దేవరకొండ
శాసనసభా
నియోజకవర్గం
నుంచి
ధీరావత్
భారతి
ఏక్రగీవంగా
ఎన్నికయ్యారు.
రామావత్
శంకర్
నాయక్
తన
నామినేషన్‌ను
సోమవారం
ఉదయం
11
గంటలకు
ఉపసంహరించుకున్నారు.
దీంతో
భారతి
ఏకగ్రీవంగా
ఎన్నికైనట్లు
రిటర్నింగ్
అధికారి
ప్రకటించారు.
రామావత్
శంకర్
నాయక్
ఇండిపెండెంట్‌గా
నామినేషన్
వేశారు.
భారతి
కాంగ్రెస్
అభ్యర్థిగా
నామినేషన్
వేశారు.
భారతి
భర్త
కాంగ్రెస్
శాసనసభ్యుడు
ధీరావత్
రాగ్యానాయక్‌ను
నక్సలైట్లు
హత్య
చేయడంతో
దేవరకొండ
నియోజకవర్గానికి
ఉప
ఎన్నిక
అవసరమైంది.
ఆయన
హత్యకు
తీవ్రంగా
కదిలిపోయిన
అధికార
తెలుగుదేశం
సహా
రాజకీయ
పార్టీలు
రాగ్యానాయక్
కుటుంబ
సభ్యులు
ఎవరైనా
పోటీ
చేస్తే
ఆ
నియోజకవర్గంలో
తాము
పోటీ
చేయబోమని
ప్రకటించాయి.
ఆ
నియోజకవర్గంలో
బలంగా
వున్న
సిపిఐ
మాత్రం
జాతీయ
నాయకత్వాన్ని
సంప్రదించి
నిర్ణయం
తీసుకుంటామని
ఆ
సమయంలో
ప్రకటించింది.
దేవరకొండ
నియోజకవర్గం
ఎన్నికకు
నోటిఫికేషన్
వెలువడిన
తర్వాత
తమ
అభ్యర్థిని
పోటీకి
దించబోమని
సిపిఐ
ప్రకటించింది.
అయితే
రామావత్
శంకర్
నాయక్
ఇండిపెండెంట్‌గా
నామినేషన్
వేశారు.
రామావత్
శంకర్
నాయక్‌తో
నల్లగొండ
కాంగ్రెస్
పార్టీ
నేతలు
సంప్రదింపులు
జరిపి
ఆయన
చేత
నామినేషన్‌ను
ఉపసంహరింపజేశారు.