ఆరుగురు పాక్ సైనికుల హతం
హైదరాబాద్:విద్యుత్ ఉద్యమం చీలిపోయింది. ఏడు సంఘాలతో కూడిన ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి)కి ఏకంగా దాని చైర్మనే రాజీనామా చేశారు. దీంతో జెఎసిలోని ప్రధాన భాగస్వామ్యసంఘమైన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ (1104) విడిపోయినట్లే. కెమిస్టుల అసోసియేషన్ కూడా జెఎసి నుంచి విడిపోయింది. దీంతో గత కొంత కాలంగా జరుగుతున్నవిద్యుత్ ఉద్యోగుల ఉద్యమానికి గండి పడినట్లే.
ఈ పరిణామాల కోసమే ఎదురు చూస్తున్న ఇంధన శాఖ వెంటనే 1104 యూనియన్‌ను చర్చలకు ఆహ్వానించింది. ఈ యూనియన్ నేతలు ఆదివారం రాత్రి ఇంధన శాఖ అధికారులతో చర్చలు ప్రారంభించారు. జెఎసి నుంచి విడిపోయిన రెండు సంఘాలతో ఇంధనశాఖ ఆదివారం రాత్రి చర్చలు జరిపి కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చింది. దీంతో ఆందోళననువిరమించుకుంటున్నట్లు ఈ సంఘాలు ప్రకటించాయి. ఈ సంఘాలు విడిపోయినప్పటికీ జెఎసిలో ఇంకా ఐదు సంఘాలు వున్నాయి.












Click it and Unblock the Notifications
