కాశ్మీర్ చేరుకున్న ప్రధాని
శ్రీనగర్: అసాధారణ భద్రత మధ్య ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంగళవారం ఇక్కడికి చేరుకున్నారు. రెండేళ్లలో ప్రధాని కాశ్మీర్ లోయలో పర్యటించడం ఇది రెండోసారి.
శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన గవర్నర్ జి.సి.సక్సేనాతోనూ, ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతోనూ మాట్లాడుతారు. కాంగ్రెస్, ఇతర ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా ఆయన కలుసుకుంటారు.హోం మంత్రి ఎల్.కె. అద్వానీ, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఆయనను అనుసరిస్తారు. ఆర్మీ, పారామిలటరీ బలగాల, పోలీసు, కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ సంస్థల యూనిఫైడ్ సమవేశానికి ఈ నెల 23వ తేదీన ఆయన అధ్యక్షత వహిస్తారు.












Click it and Unblock the Notifications
