హైదరాబాద్:
ఈ
ఆర్థిక
సంవత్సరంలో
రాష్ట్రంలో
16,510
కోట్ల
రుణాలను
ఖరారు
చేస్తూ
రాష్ట్ర
స్థాయి
బ్యాంకర్ల
సమావేశం
నిర్ణయం
తీసుకుంది.
నూతన
రంగాల్లో
పెట్టుబడులకు
అనుకూలంగా
ఏడాది
ఒకసారి
కాకుండా
ప్రతి
మూడు
నెలలకు
ఒకసారి
సమావేశం
కావాలని
బ్యాంకర్లు
నిర్ణయించుకున్నారు.
గత
పథకాల
అమలు
తీరును
ఈ
సమావేశంలో
సమీక్షించారు.
బ్యాంకు
అధికారులతో
ప్రభుత్వ
అధికారులు
కలిసి
పని
చేస్తారని
సమావేశంలో
పాల్గొన్న
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడు
చెప్పారు.
ఇందుకు
గాను
తాము
మూడు
కమిటీలు
వేస్తామని
ఆయన
చెప్పారు.
వ్యవసాయ,
దాని
అనుబంధ
సంస్థలకు
సంబంధించి
కమిటీ
ఒకటి,
మౌలిక
సదుపాయాల
కల్పనకు
సంబంధించి
రెండోది,
పరిశ్రమలకు
సంబంధించి
మూడోది
వేస్తామని
ఆయన
చెప్పారు.
రుణాలసేకరణకు
తమ
అధికారులు
సహకరిస్తారని
ఆయన
చెప్పారు.
అన్ని
బ్యాంకుల
వడ్డీ
రేట్లుఒకే
రకంగా
వుండాలని
ముఖ్యమంత్రి
చేసిన
ప్రతిపాదనపై
నిర్ణయం
తీసుకునే
అధికారం
తమకు
లేదని
బ్యాంకర్లు
చెప్పారు.