కాల్పుల్లో అబ్దుల్ గనీ లోన్ హత్య
హైదరాబాద్: కాకతీయ డిక్లరేషన్ ముసాయిదా రూపకల్పనకు తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 27వ తేదీ నుంచి వరంగల్‌లో జరగనున్న చేసే తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ కాకతీయ డిక్లరేషన్‌గా పిలుస్తోంది.
మినీ మహానాడుల సందర్భంగా ఆదిలాబాద్‌లో జరిగిన ఘర్షణలను, హైదరాబాద్‌లో తలెత్తిన అసంతృప్తిని తెలుగుదేశం నాయకత్వంసీరియస్‌గా తీసుకుంటోందని తెలుగుదేశం నాయకుడు ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు చెప్పారు. కొన్ని జిల్లాల్లోని పార్టీ నాయకుల్లో అవగాహనా లోపం, విభేదాలు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈవిషయాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
తెలుగుదేశం మహానాడుకు వరంగల్‌లో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఆరు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో చెప్పారు.వీరందరికి వసతి సౌకర్యం, భోజన సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లింక్ రోడ్ల మరమ్మత్తులు సాగుతున్నాయి.