వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దండిగా ఎమ్మెల్యేల విదేశీ యాత్రలు
హైదరాబాద్: శాసనసభ్యుల విదేశీ అధ్యయన యాత్రలనుపెంచనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఇటీవల బృందాలుగా విదేశాల్లో పర్యటించి వచ్చిన శాసనసభ్యులతో ఆయన శనివారం సమావేశమయ్యారు.
తాము పర్యటించి వచ్చిన దేశాల్లో మౌలిక వసతుల కల్పన బాగా వున్నదని శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. అభివృద్ధివిషయంలో ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య సమన్వయం ఉన్నదని వారు చెప్పారు. శాసనభ్యుల విదేశీ పర్యటనలు పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల సందర్శనకు కూడావీలు కలిగేలా చూడాల్సిన అవసరం ఉన్నదని వారన్నారు. తాము తిరిగి వచ్చిన దేశాల్లో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు లేవని వారు చెప్పారు.
Comments
Story first published: Saturday, May 25, 2002, 23:53 [IST]